News November 29, 2025
FBలో హాయ్‌తో పరిచయమై.. రూ.14 కోట్లు కొట్టేసింది

HYD ఎర్రగడ్డకు చెందిన డాక్టర్ నుంచి ఓ మాయలేడి రూ.14Cr కొట్టేసింది. మోనిక పేరిట AUG 27న FBలో హాయ్ అని మెసేజ్ చేసింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి, పర్సనల్ ఫొటోలు షేర్ చేసుకున్నారు. డబ్బులు డబుల్ అవుతాయని ట్రేడ్ మార్కెట్లో విడతల వారీగా రూ.14Cr పెట్టించింది. అకౌంట్లో రూ.34Cr ఉన్నట్లు చూపడంతో డ్రా చేద్దామంటే రాకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. ‘ఆమె’ వెనుక సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Similar News
News December 4, 2025
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకూ నెలసరి సెలవులు

ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకూ నెలసరి సెలవులను(ఏడాదికి 12) వర్తింపజేస్తూ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అదనంగా 1.5 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. ప్రైవేట్ రంగాల్లోని మహిళలకు(18-52 ఏళ్లు) పెయిడ్ లీవ్‌ను తప్పనిసరి చేస్తూ గత నెల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కాగా బిహార్, ఒడిశా రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు, కేరళలో యూనివర్సిటీ సిబ్బందికి నెలసరి సెలవులు ఇస్తున్నాయి.
News December 4, 2025
ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్‌కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.
News December 4, 2025
160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<


