News November 29, 2025

అడక్కుండానే తిరుపతికి అన్నీ ఇచ్చారుగా.!

image

తిరుపతికి శ్రీవారి ఆలయం తిరుగులేని మకుటం. ఇప్పుడు శ్రీహరికోట, ఫ్లెమ్మింగో ఫెస్టివల్ సైతం కొత్త అందాలను తీసుకొచ్చాయి. వాటితోపాటూ కనుపూరు ముత్యాలమ్మ, వెంకటగిరి పోలేరమ్మ జాతర, గూడూరు జెండా పండగ సైతం జిల్లా శిగలో చేరాయి. పెంచలకోన, అతిపెద్ద మట్టికట్ట జలాశయం కండలేరు సైతం తిరుపతిలో కలవడంతో జిల్లాలో పర్యాటక ప్రాంతాల సంఖ్య మరింత పెరిగింది. రాయలసీమకు సముద్రం ఇచ్చారంటూ జిల్లా వాసులు సంబర పడుతున్నారు.

Similar News

News December 1, 2025

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు చలి గాలులు అధికంగా వీచే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.

News December 1, 2025

గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు

image

మెదక్ జిల్లాలో నవంబర్ 28 నుంచి ఆదివారం వరకు జరిగిన 44వ తెలంగాణ రాష్ట్రస్థాయి ఖోఖో జూనియర్ బాలబాలికల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు ప్రతిభ కనబర్చాయి. ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర, బాలికల జట్లు మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఖోఖో సంఘం సభ్యులు, క్రీడాభిమానులు అభినందించారు.

News December 1, 2025

పలాస: యాక్సిడెంట్.. యువకుడుకి తీవ్ర గాయాలు

image

పలాస మండలం సున్నాడ గ్రామ జంక్షన్ సమీప రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు.