News April 18, 2024

జిల్లాలో 377 ధాన్యం కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్ 

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 377 కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. సాధారణ రకం క్వింటాలుకు రూ.2,183, గ్రేడ్-ఏ రకం రూ.2,203 మద్దతు ధర ఇస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఎదురయ్యే సమస్యలను, ఫిర్యాదులను 1800 425 2532 నంబర్ కు కాల్ చేసి చెప్పాలన్నారు. 

Similar News

News January 12, 2026

తూ.గో: ఇనుపరాడ్‌తో కొట్టి భార్యను హతమార్చిన భర్త

image

కుటుంబ కలహాలు ఓ మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయి. రాజమండ్రి రూరల్(M) కొంతమూరులోని బూసమ్మకాలనీకి చెందిన కన్నారామకృష్ణ శనివారం అర్ధరాత్రి భార్య పద్మ(36)తో గొడవపడి, పదునైన ఇనుపరాడ్‌తో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ వీరయ్యగౌడ్‌ వెల్లడించారు.

News January 12, 2026

తూ.గో: నేడు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు

image

తూ.గో జిల్లాలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం PGRS కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. నేడు భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారులు పలు రెవెన్యూ రికార్డులతో ఈ ప్రోగ్రామ్‌కు హాజరుకావాలన్నారు.