News April 18, 2024
నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలి: అనంత ఎస్పీ

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల వద్ద పటిష్ఠ బందోబస్తు చేపట్టాలని పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ సూచించారు. బుధవారం శింగనమల మండల కేంద్రంలోని నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నియమ నిబంధనలు అమలు చేసి నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ల వద్ద నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే లోపలికి అనుమతించనున్నట్లు తెలిపారు.
Similar News
News September 11, 2025
అనంత జిల్లాలో వర్షం.. పిడుగులు పడే అవకాశం..!

అనంతపురం జిల్లాలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని APSDMA పేర్కొంది. ‘ఇప్పటికే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చేటప్పుడు చెట్లు, టవర్స్, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదు. సురక్షితమైన ప్రాంతాలలో ఆశ్రయం పొందాలి’ అంటూ ఫోన్లకు సందేశాలు పంపింది. ఇలాంటి మెసేజ్ మీకు కూడా వచ్చిందా అయితే కామెంట్ చేయండి.
News September 10, 2025
రైతులు అధైర్య పడకండి.. యూరియా కొరత లేదు: కలెక్టర్

అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా యూరియాను సక్రమంగా అందిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో వివిధ రైతు సేవా కేంద్రాల్లో 298 మెట్రిక్ టన్నులు, సొసైటీలలో 92, ప్రైవేట్ డీలర్ల వద్ద 448 మెట్రిక్ టన్నులు, హోల్సేల్ డీలర్లు & AP Markfed వద్ద 1069 మెట్రిక్ టన్నులు, రవాణా కింది 519 మెట్రిక్ టన్నులు మొత్తంగా జిల్లాలో 2,426 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
News September 9, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన షెడ్యూల్ ఇదే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతపూరం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:40 గంటలకు పుట్టపర్తి సత్య సాయిబాబా విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకుంటారు. ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6 సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.