News November 29, 2025

మంత్రి వద్దన్నా.. రేణిగుంటలో మళ్లీ పోస్టింగ్.!

image

అవినీతి ఆరోపణలతో సస్పెండైన రేణిగుంట రిజిస్ట్రార్ ఆనంద్ రెడ్డి మళ్లీ అక్కడే పోస్టింగ్ పొందారు. ఆయనకు ఉద్యోగం ఇవ్వాలంటూ స్పెషల్ CS పంపిన ఫైల్‌ను మంత్రి అనగాని తిరస్కరించారు. ఇందుకు విరుద్ధంగా ఇటీవల చిత్తూరు రిజిస్ట్రేషన్ శాఖ ఇన్‌ఛార్జ్ DIGగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఆనంద్‌కు మళ్లీ రేణిగుంటలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆనంద్ రేంజ్ ఏంటో అర్థమవుతుందని పలువురు చర్చించుకుటున్నారు.

Similar News

News December 1, 2025

POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

image

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్‌ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.

News December 1, 2025

ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

image

పార్సిల్‌లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్‌ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.

News December 1, 2025

వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

image

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.