News April 18, 2024
ఎన్నికల వేళ జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కలకలం
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా ప్రాంతంలో బిహార్‌కు చెందిన రాజా షా సహా మరో వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో షా ప్రాణాలు కోల్పోయాడు. కాగా గత వారం రంజిత్ సింగ్ అనే టూరిస్ట్ గైడ్‌పై ముష్కరులు దాడి చేయగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈనెల 19న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కాల్పులు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 18, 2024
నెవర్ బిఫోర్.. T20ల్లో ఇండియా విన్నింగ్ స్ట్రైక్ రేట్ 92.31%
ఇటీవల సౌతాఫ్రికాపై 3-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా అరుదైన రికార్డును సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్(92.31 శాతం) నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఈ ఏడాది భారత్ 26 మ్యాచ్‌లకు గాను ఏకంగా 24 టీ20ల్లో గెలిచింది. 2018లో పాక్ 89.43%, 2023లో ఉగాండా 87.88%, 2019లో పపువా న్యూగినియా 87.5%, 2022లో టాంజానియా 80.77% విజయాలు నమోదు చేశాయి.
News November 18, 2024
BIG BREAKING: ఎందరు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులే
AP: పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ నిబంధనలు మారుస్తూ ఏపీ అసెంబ్లీ నిర్ణయం తీసుకుంది. జనాభా వృద్ధి రేటు పెంపులో భాగంగా ఏపీ మున్సిపల్ శాసనాల సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇకపై ఎందరు పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత లభిస్తుంది. మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందితే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది.
News November 18, 2024
హరీశ్ రావు పక్కచూపులు చూస్తున్నారు: TPCC చీఫ్
TG: BRSలో ఎవరూ మిగలరని, హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.