News November 29, 2025

TTD తీర్మానం లేకుండానే..!

image

తిరుమల పరకామణీ చోరీకి సంబంధించి టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రవికుమార్, అతని భార్యకు చెందిన 7ఆస్తులను గిఫ్ట్ డీడీ కింద రాయించారు. గిఫ్ట్ డీడీ గురించి 2023 జూన్ 19న TTD బోర్డు తీర్మానం చేసింది. అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. మే 12న 5ఆస్తులు, మే 18న చెన్నైలోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశారు. ఆస్తులు తీసుకున్నాకే తీర్మానం చేయడం కుట్ర కాదా?’ అని పట్టాభి ప్రశ్నించారు.

Similar News

News December 3, 2025

అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏ గ్రామం నుంచి ఎంతో తెలుసా.!

image

పల్నాడు జిల్లాలో రాజధాని అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధమైంది. అమరావతి మండలంలోని పలు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి భూమిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి మండలంలోని వైకుంఠపురంలో 1,965 ఎకరాలు, పెద్ద మద్దూరులో 1,018 ఎకరాలు, యండ్రాయి గ్రామంలో 1,879 ఎకరాల పట్టా, 46 ఎకరాల అసైన్డ్ భూమి, కర్లపూడి, లేమల్లెలో 2,063 ఎకరాల పట్టా, 50 ఎకరాల అసైన్డ్ భూమి భూమిని సేకరించనున్నారు.

News December 3, 2025

VJA: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఓ బాలికపై 2021వ సంవత్సరంలో అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి ఫిర్యాదు మేరకు వసంత్ కుమార్‌పై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి భవాని తీర్పునిచ్చారు.

News December 3, 2025

WGL: సీఎం సభపై భరోసా!

image

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు 3వ దశ నామినేషన్లకు చేరుకొవడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది. ప్రజా విజయోత్సవ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న తరుణంలో పంచాయతీ ఎన్నికలను ప్రస్తావించడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులు భావిస్తున్నారు. నర్సంపేటలో ఈ నెల 5న సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఈ సభనే తమకు మైలేజని అభ్యర్థులంటున్నారు.