News November 29, 2025

ట్రంప్‌ షాక్‌తో భారీగా పడిపోయిన ఎగుమతులు

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌లతో 2025 మే నుంచి అక్టోబర్ మధ్య భారత ఎగుమతులు 28.5% క్షీణించాయని GTRI వెల్లడించింది. ముఖ్యంగా రత్నాలు, నగలు, టెక్స్‌టైల్‌ , కెమికల్స్, సముద్ర ఆహారం వంటి రంగాలు 31% వరకూ నష్టపోయాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 36% పడిపోయాయి. సుంకాలు తగ్గించేందుకు ప్రభుత్వం నుంచి చర్యలు ఆలస్యం కావడం పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోందని GTRI హెచ్చరించింది.

Similar News

News December 1, 2025

అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.

News December 1, 2025

సమంత పెళ్లిపై పూనమ్ పరోక్ష విమర్శలు!

image

హీరోయిన్ సమంత రెండో వివాహంపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన, నిరాశయులైన పురుషులను డబ్బుతో కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పీఆర్‌ గొప్పవారిగా చూపిస్తున్నారు’ అంటూ ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. సమంత వివాహంపై చేసిన ఈ వ్యాఖ్యలు SMను ఊపేస్తున్నాయి.

News December 1, 2025

CSIR-IHBTలో ఉద్యోగాలు

image

CSIR-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోస్పియర్ టెక్నాలజీ(IHBT) 9 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల వారు DEC 29 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc( అగ్రికల్చర్/హార్టికల్చర్/ఫారెస్ట్రీ/ బయాలజీ/ కెమికల్ సైన్స్/ అనలైటికల్ కెమిస్ట్రీ/కెమికల్ ఇంజినీరింగ్/ బయో కెమికల్ ), టెన్త్+ITI/ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.