News November 29, 2025
ఫ్లాగ్ డే నిధికి విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపు

దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాల సహాయార్థం సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలివ్వాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్‌లో ఫ్లాగ్ డే-2025 నిధి సేకరణ కోసం కార్‌ఫ్లాగ్‌లు, స్టిక్కర్లను ఆవిష్కరించారు. “దేశ సరిహద్దుల్లో నిత్యం పహారా కాసే సైనికుల సేవలకు గుర్తింపుగా ఫ్లాగ్ డే నిర్వహిస్తాం. వారు దేశానికి అండగా ఉంటారు. మనం వారికి అండగా నిలవాలి” అని పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
గద్వాల్: ఓ యువత ఏటువైపు మీ ఓటు..!

జోగులాంబ గద్వాల జిల్లాలో 11,600 మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ సారి జరిగే సర్పంచ్ ఎలక్షన్లలో మొదటి ఓటు వేయడానికి ఉత్సాహ పడుతున్నారు. అభివృద్ధి చేసే వారికి ఓటు వేస్తారా లేక మాటలు చెప్పి మబ్బి పెట్టే వారికి ఓటు వేస్తారా అనే సందేహం ఉంది. యువత మాత్రం అభివృద్ధి చేసే వారికే ఓటు వేస్తారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. యువత తలచుకుంటే ఏదైనా చేస్తారని పలువురు ప్రజలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్..?
News December 4, 2025
నిజామాబాద్: 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ బుధవారంతో ముగియగా జిల్లాలో 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. వర్ని మండలంలో 10, బోధన్ మండలంలో 4, సాలూర మండలంలో 3, కోటగిరి మండలంలో 5, చందూరు మండలంలో 2, పోతంగల్, ఎడపల్లి, నవీపేట్ మండలాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.
News December 4, 2025
Dy.Cm భట్టి స్వగ్రామం సర్పంచి స్థానం ఏకగ్రీవం

Dy.Cm భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా(మం) స్నానాలలక్ష్మీపురం గ్రామపంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావుకు పోటీగా వేసిన ఇతర అభ్యర్థులందరూ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో పంచాయతీ సర్పంచ్‌తో పాటు 8 వార్డుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్యత దృష్ట్యా భట్టి, ఎమ్మెల్యే రాందాస్ సూచనలతో పోటీదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.


