News November 29, 2025
కేజీహెచ్‌లో పనిచేయని ఫైర్ ఫైటింగ్ సిస్టం

రూ.కోట్లు ఖర్చుపెట్టి కేజీహెచ్‌లో ఫైర్ ఫైటింగ్ లైన్ సిస్టం ఏర్పాటు చేసినప్పటికీ నిరూపయోగంగా మారింది. కేజీహెచ్ అంతా గతంలోనే ఫైర్ ఫైటింగ్ అవసరాలు నిమిత్తం మంచినీటి పైప్లైన్ ఎక్కడకక్కడ వాల్స్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. అయితే అవేవీ ఇప్పుడు పని చేయకుండా మూలకు చేరాయి. ప్రధాన వాల్స్ దగ్గర పనిముట్లు కూడా చోరీకి గురయ్యాయి. పర్యవేక్షణ లేకపోవడం వల్లే కేజీహెచ్‌లో సమస్యలు చుట్టుముడుతున్నాయి.
Similar News
News December 1, 2025
POK భారత్‌లో అంతర్భాగమే: JK హైకోర్టు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడ జరిగే వ్యాపారాన్ని ఇన్‌ట్రా స్టేట్ ట్రేడింగ్‌గా పరిగణించాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టు చెప్పింది. GST అమలులోకి వచ్చినప్పటి నుంచి 2019లో POKలో వ్యాపారాన్ని నిలిపేసే వరకు జరిగిన ఎగుమతులు, దిగుమతులకు ట్యాక్స్ కట్టాలని అధికారులిచ్చిన నోటీసులపై వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. దీని విచారణలో భాగంగా హైకోర్టు ఈ కామెంట్లు చేసింది.
News December 1, 2025
ఈ కాల్స్/మెసేజ్‌లను నమ్మకండి: పోలీసులు

పార్సిల్‌లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్‌లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్‌తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్‌లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.
News December 1, 2025
వేములవాడ(R) మండలంలో 34 వార్డులు ఏకగ్రీవం

వేములవాడ రూరల్ మండలంలో 34 వార్డుల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. మండలంలోని మొత్తం 17 గ్రామపంచాయతీలకు సంబంధించి 146 వార్డులలో 34 వార్డుల్లో సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జయవరంలో 7, అచ్చన్నపల్లి 5, బొల్లారం 3, చెక్కపల్లి 2, ఫాజుల్ నగర్ 4, మల్లారం 1, నాగయ్యపల్లి 1, నమిలిగుండుపల్లి 1, తుర్కాశినగర్ 5, వెంకటంపల్లిలో 5 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.


