News November 29, 2025
ఎస్.కోటకు ‘నో’ చెప్పిన సీఎం..!(1/1)

జిల్లాల పునర్విభజనలో భాగంగా <<18425803>>ఎస్.కోట<<>> ప్రజలకు కూటమి ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామి అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే కోళ్ల ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాల పునర్విభజనపై చర్చ జరిగినప్పటికీ ఎస్.కోట విలీన అంశం ఎక్కడా ప్రస్తావనకు రాకపోవడం ఆ ప్రాంత ప్రజల్లో చర్చకు దారి తీసింది.
Similar News
News December 1, 2025
VKB: సజావుగా సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ డివిజన్లోని రెండవ విడత సర్పంచ్ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా వికారాబాద్ మండలం పులుమద్దిలో నామినేషన్ల ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. నామినేషన్లను తిరస్కరించకుండా అవసరమైన పత్రాలను తెప్పించుకొని అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు.
News December 1, 2025
అనకాపల్లి: 91.62 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

అనకాపల్లి జిల్లాలో సోమవారం మధ్యాహ్నం 3.13 గంటల వరకు 91.62 శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేసినట్లు డీ.ఆర్.డీ.ఏ పీడీ శచీదేవి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,56,338 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,34,866 మందికి అందజేసినట్లు తెలిపారు. సబ్బవరం మండలంలో అత్యధికంగా 95.63 శాతం మందికి పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. సాయంత్రంలోగా అందరికీ పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించినట్లు వివరించారు.
News December 1, 2025
అనకాపల్లి: ఇళ్లు, ఇంటి స్థలం కోసం వేచి చూస్తున్న వారికి గమనిక

PMAY హౌసింగ్(గ్రామీణ) సర్వే గడువును ఈ నెల 14 వరకు పొడిగించారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ బత్తుల తాతయ్యబాబు సోమవారం వడ్డాదిలో తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో స్థలం ఉన్నవారికి ఇళ్ల స్కీం, స్థలం లేని వారికి స్థలంతో ఇళ్లు కూడా మంజూరు చేస్తామన్నారు. గత నెల 30తో గడువు ముగిసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం గడువు పొడిగించిందన్నారు. అర్హులు సచివాలయాలలో దరఖాస్తు సమర్పించాలన్నారు.


