News April 18, 2024

ASF: ఈదురు గాలులకు ఎగిరిపడిన వృద్ధురాలు

image

ఆసిఫాబాద్ మండలం బురుగూడ గ్రామంలో బుధవారం సాయంత్రం 5గంటలకు ఈదురు గాలులకు బురుగూడకి చెందిన వృద్ధురాలు చున్నూబాయి ఎగిరి పడింది.. సాయంత్రం వర్షం వస్తుండడంతో వృద్దురాలు చున్నూబాయి ఇంటి ముందు నిలబడి ఉంది. ఈదురుగాలులు బలంగా వీయడంతో చున్నూబాయి ఎగిరిపడి ముళ్ల కంపలో చిక్కుకుంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యయి. వెంటనే ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Similar News

News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

News April 23, 2025

9 నుంచి 27 ర్యాంక్‌కు పడిపోయిన ADB జిల్లా

image

ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి. ADB జిల్లాలో ఫస్టియర్ 9,106 మంది పరీక్షలు రాయగా 4,967 మంది పాసయ్యారు. సెకండియర్‌లో 8,890కి 6,291 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం ఫస్టియర్‌లో 54.55, సెకండియర్‌లో 70.76గా నమోదైంది. ఫస్టియర్‌లో రాష్ట్రంలో జిల్లా గతేడాది 9వ స్థానంలో ఉండగా.. ఈసారి 27వ స్థానంలో నిలిచింది. సెకండియర్ గతేడాది 13వ ప్లేస్‌లో ఉండగా ఈసారి 12వ స్థానంలో నిలిచింది.

News April 23, 2025

ADB: గ్రేట్.. వ్యవసాయ కూలీ బిడ్డకు 989 మార్కులు

image

వ్యవసాయ కూలీ బిడ్డ ఇంటర్ ఫలితాల్లో 989 మార్కలు సాధించి అందరి మన్ననలు పొందుతున్నాడు. టాలెంట్‌కి పేదరికం అడ్డురాదని నిరూపించాడు నార్నూర్ మండలం ఖంపూర్ గ్రామానికి చెందిన జాదవ్ కృష్ణ. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదివినా ఇంటర్ ఎంపీసీలో 989 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కృష్ణను చదివించారు. కృష్ణకు మంచి మార్కులు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

error: Content is protected !!