News November 29, 2025
నెల్లూరు: ఎమ్మార్వో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

నెల్లూరు గ్రామీణ మండల పరిధిలో దిత్వా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలు పడే అవకాశమున్నందున రూరల్ ఎమ్మార్వో కృష్ణ ప్రసాద్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు తక్షణ సహాయ చర్యలు అందించేందుకు, అత్యవసర పరిస్థితులను వెంటనే సంబంధిత శాఖలకు చేరవేసేందుకు 24×7 కంట్రోల్ రూమ్ కు తెలిపేందుకు 9441592127 నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 7, 2026
నెల్లూరు: రైలు ఢీకొని మహిళ స్పాట్ డెడ్

మనుబోలు రైల్వే స్టేషన్ ఉత్తరం వైపు ఫ్లాట్ ఫామ్ చివరన చెన్నై నుంచి విజయవాడ వెళ్లే లైన్‌లో గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు రైలు ఢీకొని శనివారం సాయంత్రం మృతి చెందింది. వయస్సు సుమారు 50-55 ఏళ్లు ఉండొచ్చని, 5.0అడుగుల ఎత్తు కలిగి చాయా రంగు కలిగి ఉందని రైల్వే ఎస్సై హరి చందన తెలిపారు. మృతురాలు సిమెంట్ రంగుపై బులుగు రంగు సిల్క్ చీర, ఆకుపచ్చ పావడాను ధరించి ఉందని అన్నారు.
News February 7, 2026
సోమిరెడ్డికి కాకాణి సవాల్

నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారిందని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రైతులను అడ్డం పెట్టుకుని పనులు చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దోచుకున్నారన్నారు. ఈ అక్రమాలపై సీఎంకు లేఖ రాసినా స్పందన లేదని మండిపడ్డారు. అవినీతి ప్రశ్నిస్తే దాడులు, బెదిరింపులు చేస్తున్నారని, విజిలెన్స్ విచారణకు సిద్ధమా అని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.
News February 7, 2026
నెల్లూరు: అయినోళ్లే ప్రాణాలు తీస్తున్నారు..!

నెల్లూరు జిల్లాలో చాలామందికి చట్టం అంటే భయం లేకుండా పోయింది. కావలిలో ఆస్తి కోసం సొంత వారే రైల్వే ఉద్యోగి <<19066737>>నాగరాజును <<>>హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. నవాబుపేటలో మహిళ <<19072747>>హత్య<<>>, సైదాపురంలో అన్నదమ్ముల మధ్య రక్తపాతం జిల్లాను ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు రాత్రి వేళ గస్తీ, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టినా.. వరుస హత్యలు ఆగడం లేదు. నేరస్థులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


