News April 18, 2024
సీఎం జగన్ నేటి బస్సు యాత్ర షెడ్యూల్

AP: సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజైన ఇవాళ్టి షెడ్యూల్‌ను YCP విడుదల చేసింది. తేతలి నుంచి ఉ.9 గంటలకు బయల్దేరనున్న ఆయన.. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట, చర్చి సెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం చేరుకొని ఇవాళ రాత్రికి అక్కడ బస చేస్తారు.
Similar News
News July 5, 2025
వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News July 5, 2025
బాధ్యతలు స్వీకరించిన రామ్‌చందర్ రావు

TG: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా రామ్‌చందర్ రావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌లో కిషన్ రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావును పలువురు నేతలు, నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు.
News July 5, 2025
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు

APలో స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. QR కోడ్‌తో వివరాలు ప్రత్యక్షమయ్యేలా పాత కార్డుల స్థానంలో కొత్తవి ఆగస్టులో పంపిణీ చేయనుంది. నేతల ఫొటోలు లేకుండా, ప్రభుత్వ అధికారిక చిహ్నం, లబ్ధిదారు ఫొటో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 1.46 కోట్ల పాత కార్డులతో పాటు కొత్తగా 2 లక్షల కొత్త రేషన్‌కార్డుదారులకు వచ్చే నెలలో వీటిని జారీ చేయనుంది.