News April 18, 2024
నేటి నుంచి నామినేషన్లు మొదలు: ముకేశ్ కుమార్ మీనా

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం నేటి నుంచి ప్రారంభమవుతుందని, ఇందుకోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంటు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Similar News
News April 21, 2025
కృష్ణా: ‘నేడు కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం’

ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు(సోమవారం) కలెక్టరేట్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందన్నారు.
News April 20, 2025
కృష్ణా: LLB పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్శిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన LLB 3వ, 7వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం సూచించింది.
News April 20, 2025
పెనమలూరు: రూ. 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు

ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న తాడిగడపకు చెందిన నూకల విజయశ్రీని సైబర్ నేరగాళ్లు భారీ మోసం చేశారు. ఆన్‌లైన్ టాస్కుల పేరుతో గ్రూపుల్లో చేర్చి, పెట్టుబడికి అధిక లాభాలంటూ నమ్మబలికిన నేరస్తులు దశలవారీగా ఆమె నుంచి రూ.22 లక్షలు దోచుకున్నారు. స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.