News April 18, 2024
యూపీలో తెలంగాణ మహిళ పోటీ
తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి UPలోని జౌన్‌పుర్ BSP MP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె మాజీ MP ధనుంజయ్ సింగ్ మూడో భార్య. వివిధ కేసుల్లో ఆయనకు శిక్షపడటంతో భార్యను బరిలో నిలిపారు. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గతంలో హుజూర్‌నగర్‌లో స్వతంత్ర MLAగా గెలిచారు. తల్లి లలితారెడ్డి సర్పంచిగా సేవలందించారు. నిప్పో బ్యాటరీల కంపెనీ ఈ కుటుంబానికి చెందినదే. శ్రీకళారెడ్డి పేరిట రూ.780 కోట్ల ఆస్తులున్నాయి.
Similar News
News November 18, 2024
GREAT: కంటిచూపు లేకపోయినా గ్రూప్-4 జాబ్
ఖమ్మం జిల్లా కారేపల్లి(M) చీమలవారిగూడెంకు చెందిన మానస అంధురాలు. టెన్త్ వరకు గ్రామంలో, అనంతరం ఫ్రెండ్స్ సాయంతో కారేపల్లికి 4KM నడిచి వెళ్లి ఇంటర్, డిగ్రీ చదివారు. ఇంటి వద్దే ప్రిపేరై 2022లో బ్యాంక్ జాబ్ సాధించిన మానస.. సహాయకురాలి చేయూతతో గ్రూప్-4 పరీక్ష రాశారు. తన కృషికి ఫలితాల్లో జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. తపన ఉంటే లక్ష్యసాధన కష్టం కాదని మానస నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
News November 18, 2024
అది మంచి పద్ధతి కాదు: RBI గవర్నర్ వార్నింగ్
బ్యాంకులు తప్పుడు లేదా అరకొర సమాచారంతో కస్టమర్లకు ప్రొడక్ట్స్ విక్రయించడంపై RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. ఈ విధానంతో షార్ట్ టర్మ్‌లో లాభపడినా లాంగ్‌టర్మ్‌లో నష్టపోతారని హెచ్చరించారు. KYC వెరిఫికేషన్ కాకుండా అకౌంట్లు తెరవడం, మిస్ సెల్లింగ్ వంటి అనైతిక పద్ధతులను అడ్డుకోవాలన్నారు. వీటికి తావులేకుండా స్టాఫ్ ఇన్సెంటివ్స్‌ను రూపొందించాలని సూచించారు.
News November 18, 2024
లగచర్ల ఘటనలో పంచాయతీ సెక్రటరీ సస్పెండ్
TG: లగచర్ల ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, రైతులను రెచ్చగొట్టారని దౌల్తాబాద్(M) సంగయ్యపల్లి పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్‌ను వికారాబాద్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. దాడి సమయంలో ఇతను కీలకంగా ఉన్నట్లు పోలీసుల వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాఘవేందర్ రిమాండ్‌లో ఉండగా, మరిన్ని కేసుల నమోదుకు అవకాశం ఉంది. ఈ కేసులో A1 పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాగా, A2 సురేశ్ పరారీలో ఉన్నారు.