News April 18, 2024

షర్మిలను కడప ఎంపీగా చూడాలనేది వివేకా కోరిక: సునీత

image

AP: కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీసీసీ చీఫ్ షర్మిలను గెలిపించాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత అభ్యర్థించారు. షర్మిలను కడప ఎంపీగా చూడాలన్నదే వివేకా చివరి కోరిక అని.. దాన్ని నెరవేర్చేందుకు సన్నద్ధమయ్యానని తెలిపారు. హంతకులకు ఓటు వేయొద్దని ప్రజలను కోరారు. ఈ నెల 20వ తేదీన షర్మిల ఎంపీగా నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు.

Similar News

News February 5, 2026

వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

image

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.

News February 5, 2026

ICAR-IARIలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(<>IARI<<>>) 5 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు దరఖాస్తును ఈ-మెయిల్ dk6473@gmail.comకు FEB 28 వరకు సెండ్ చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MSc/MTech/ME/MCA/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iari.res.in/

News February 5, 2026

YCP భగవంతుడిపై పగ పట్టింది: పవన్

image

AP: YCP హయాంలో హిందూత్వంపై అనేక దాడులు జరిగాయని Dy.CM పవన్ పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి మీడియా సమావేశం నిర్వహించింది. ‘వీళ్లు భగవంతుడిపై పగబట్టారు. 59.70 లక్షల కిలోల కల్తీ పామాయిల్‌తో చేసిన కోట్ల లడ్డూల్లో కొన్ని అయోధ్య కూడా పంపారు. వీళ్లు చెప్పిన కల్తీ నెయ్యికి సంబంధించి ఆన్ రికార్డ్ సాక్ష్యాలు కూడా దొరికాయి. భగవంతుడిపై పగబట్టిన వాళ్లు సర్వనాశనం అయిపోతారు’ అని పేర్కొన్నారు.