News November 30, 2025

కామారెడ్డి: అభివృద్ధే.. మా అభ్యర్థుల గెలుపునకు పునాది: షబ్బీర్

image

మా ప్రభుత్వం చేసిన అభివృద్దే కాంగ్రెస్ బలపరిచిన నలుగురు సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడానికి కారణమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులే పోటీ చేసేందుకు కరవయ్యారని పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలో 4 GPలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వెల్లడించారు.

Similar News

News November 30, 2025

నల్గొండ: నేడు నామినేషన్ల పరిశీలన

image

జిల్లాలో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. జిల్లాలో మొదటి విడతలో మొత్తం 14 మండలాల్లోని 318 పంచాయతీలు, 2870 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఆదివారం నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబరు 11వ తేదీన గ్రామపంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

News November 30, 2025

అమలాపురంలో ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్‌ ఇండియా’ కార్యక్రమానికి మద్దతుగా, జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కోనసీమలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ‘ఫిట్‌ ఇండియా సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ తో పాటు ‘డ్రగ్స్‌ వద్దు బ్రో – డ్రగ్స్‌ రహిత సమాజం మన లక్ష్యం’ అనే నినాదాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్పీ రాహుల్‌ మీనా ఆధ్వర్యంలో అమలాపురంలో జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు, అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.

News November 30, 2025

ప్రియురాలితో సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్

image

దక్షిణాఫ్రికా ఉమెన్ క్రికెటర్ క్లోయ్ ట్రయాన్ తన ప్రియురాలు, కంటెంట్ క్రియేటర్ మిచెల్ నేటివెల్(జింబాబ్వే)ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. నిన్న వారిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్రయాన్ SMలో పోస్టు చేయగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ENG ప్లేయర్లు కేథరిన్ స్కివర్-బ్రంట్, NZ క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్, లీ తహుహు కూడా స్వలింగ వివాహం చేసుకున్నారు.