News November 30, 2025
AP న్యూస్ రౌండప్

* తిరుపతి(D) గూడూరును నెల్లూరులో కలపాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ మంత్రివర్గ సంఘానికి లేఖ రాశారు.
* తిరుమలలో డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు తిరుప్పావై నిర్వహణ. ఆ రోజుల్లో సుప్రభాత సేవ రద్దు: TTD
* చేనేత, గిరిజన ఉత్పత్తులన్నీ ఒకే చోట లభించేలా దేశంలోని 5 ప్రధాన నగరాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తాం. డిసెంబర్ 20 నుంచి జనవరి 10 వరకు 22 రోజులపాటు ఎగ్జిబిషన్లు ఉంటాయి: మంత్రి సవిత
Similar News
News November 30, 2025
ప్రియురాలితో సౌతాఫ్రికా మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్

దక్షిణాఫ్రికా ఉమెన్ క్రికెటర్ క్లోయ్ ట్రయాన్ తన ప్రియురాలు, కంటెంట్ క్రియేటర్ మిచెల్ నేటివెల్(జింబాబ్వే)ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించారు. నిన్న వారిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్రయాన్ SMలో పోస్టు చేయగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ENG ప్లేయర్లు కేథరిన్ స్కివర్-బ్రంట్, NZ క్రికెటర్లు అమీ సాటర్త్‌వైట్, లీ తహుహు కూడా స్వలింగ వివాహం చేసుకున్నారు.
News November 30, 2025
WAKEUP: బాల్యం హద్దులు దాటుతోందా?

ప్రేమ పేరుతో విజయవాడ <<18413280>>మైనర్లు<<>> పారిపోయి HYD వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో షాకింగ్ వార్త వెలుగు చూసింది. వనపర్తి జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని 9వ తరగతి బాలుడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇటీవల ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఈ ఘటనలు చూస్తే బాల్యం హద్దులు దాటుతోందన్న అభిప్రాయం కలగక మానదు. ప్రేమకి అర్థం కూడా తెలియని వయసులో బిడ్డను కనడం కలవర పెట్టే విషయమే. ఈ ఘటనలు పేరెంట్స్‌కు ఓ వేకప్ కాల్.
News November 30, 2025
ప్రముఖ కమెడియన్ కన్నుమూత

ప్రముఖ కన్నడ కమెడియన్ MS ఉమేశ్(80) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. 1960లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఉమేశ్ ఇప్పటివరకు 350కి పైగా చిత్రాల్లో నటించారు. 6 దశాబ్దాలపాటు కన్నడ పరిశ్రమకు సేవలందించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి కుమారస్వామితోపాటు నటీనటులు నివాళులర్పించారు.


