News November 30, 2025

బాలాజీ రైల్వే డివిజన్‌తో కలిగే ప్రయోజనాలు.!

image

తిరుపతి రైల్వే డివిజన్‌తో రైల్వే నెట్‌వర్క్ బలపడటంతోపాటు వాణిజ్యం, ప్రయాణాలు మరింత మెరుగవనున్నాయి. ఇంజినీరింగ్, కంట్రోల్ రూమ్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ విభాగాల్లో స్థానిక ITI, పాలిటెక్నిక్ విద్యార్థులకు 10 వేలకుపైగా ఉద్యోగాలు రావచ్చు. క్రిష్ణపట్నం, రామాయపట్నం, దుగరాజపట్నం పోర్టులకు కనెక్టివిటీ మెరుగై డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ అప్‌గ్రేడేషన్, పర్యాటకం రంగాలు మరింత డెవలప్ అయ్యే అవకాశం ఉంది.

Similar News

News December 3, 2025

‘పంచాయతీ’ పోరుకు యువత జై!

image

TG: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచినవారిలో యువతే అధికంగా ఉన్నారు. పెద్దలకే పరిమితం అనుకున్న పాలిటిక్స్‌లో తమ మార్క్ చూపించేందుకు యంగ్ జనరేషన్ పోటీ పడుతోంది. రెండు విడతల్లో 70శాతానికి పైగా నామినేషన్లలో 30-44 ఏళ్ల వారే ఉండటం దీనికి నిదర్శనం. సర్పంచ్ బరిలో 60%, వార్డు సభ్యుల్లో 75శాతానికి పైగా పోటీలో ఉన్నట్లు సమాచారం. తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పలు చోట్ల ఉద్యోగాలు వదిలేసి బరిలోకి దిగుతున్నారు.

News December 3, 2025

నేడు రెండు జిల్లాల్లో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. 10.55AMకు తూ.గో. జిల్లా నల్లజర్లలో జరగనున్న ‘రైతన్నా.. మీ కోసం’ వర్క్ షాప్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక సభలో రైతులు, రైతు కుటుంబాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.45PM నుంచి 3.15PM వరకు కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. 6PMకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.

News December 3, 2025

తూ.గో: నిరుద్యోగులకు GOOD NEWS

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీ నుంచి టెన్త్, ఆపై చదువుకున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, అనంతరం ఉద్యోగం కల్పిస్తారని ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.