News November 30, 2025
HYD: పర్సనల్ వీడియోలతో బెదిరింపు.. అమ్మాయిపై దాడి

వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్న తేజ, తనతో కలిసి ఉంటున్న లక్ష్మి (25)పై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున బంజారాహిల్స్‌లోని జరిగింది. బ్లాక్‌మెయిల్ చేయడాన్ని ప్రతిఘటించిన లక్ష్మి ఛాతీపై తేజ పొడవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి బావ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

* కామారెడ్డిలో అక్రమ కట్టడాలు కూల్చివేసిన మున్సిపల్ సిబ్బంది
* కామారెడ్డి: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి
* బిక్కనూర్: బిఆర్ఎస్ పార్టీలో చేరిన సొసైటీ డైరెక్టర్లు
* బిచ్కుంద: హైమాస్ట్ లైట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
* కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ దాఖలు
* జిల్లాలో ప్రారంభమైన నూతన వైన్సులు
News December 1, 2025
MBNR: మహిళలను వేధిస్తే 8712659365 కాల్ చేయండి

పనిచేసే ప్రదేశంలో, విద్యార్థులు చదువుకునే ప్రాంతాలలో ఎవరైనా మహిళలను వేధిస్తే వెంటనే 8712659365 నంబర్‌కు కాల్ చేయాలని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. ఎల్లప్పుడూ మహిళల రక్షణ కోసం తమ షీ టీం బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. సమాచారం అందించిన వారి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుతామని సూచించారు. విద్యార్థినీలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 1, 2025
రెండో విడత నామినేషన్ల ఘట్టం రేపటితో పూర్తి: కలెక్టర్ తేజస్

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మంగళవారంతో ముగియనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. 8 మండలాల పరిధిలోని 181 సర్పంచ్, 1,628 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని ఆయన చెప్పారు. అభ్యర్థులు గడువులోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా పలు నామినేషన్ కేంద్రాలను సందర్శించారు.


