News April 18, 2024
ఖమ్మం: రేషన్ కార్డుదారులకు అలర్ట్

ప్రభుత్వం పథకాలు అందించడంలో భాగంగా రేషన్ కార్డులకు e-KYCని తప్పనిసరి చేసింది. ఇప్పటికే FEB 29తో గడువు ముగియగా మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 74% మందే KYC నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోని రేషన్ దుకాణాలకు వెళ్లి త్వరగా ఈ-కేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి గడువు తేదీ ప్రకటించనప్పటికీ.. మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
Similar News
News April 22, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 694 మందిపై కేసు నమోదు

ఖమ్మం: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 673 మందితో పాటు 21 మంది మైనర్ల డ్రైవర్ల పై కేసు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ నెలలోని 20 రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు. మద్యం సేవించి వాహనాల నడుపుతూ పట్టుపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 22, 2025
KMM: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. సైబర్ నేరస్థుడు అరెస్ట్

ఉద్యోగం ఇప్పిస్తానని పలువురిని మోసం చేసిన ఓ సైబర్ నేరస్థుడిని అరెస్ట్ చేసినట్లు సైబర్ DSP పనిందర్ తెలిపారు. DSP కథనం ప్రకారం.. నిందితుడు MK తమిళగన్ మరికొంతమంది నిందితులతో కలిసి ఆన్‌లైన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి రూ.9,25,575 నగదును తీసుకొని మోసం చేశాడు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఖమ్మం కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
News April 22, 2025
ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు: అదనపు కలెక్టర్

KMM: యాసంగి పంట కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా భారత ఆహార సంస్థ నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలు పాటించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లుల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు తరుగు తీయడానికి వీలు లేదని సూచించారు.