News November 30, 2025
309 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)లో 309 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. Jr అసోసియేట్ పోస్టుకు 20-32 ఏళ్ల మధ్య, Asst.మేనేజర్ పోస్టుకు 20-35ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో సాధించిన మెరిట్/ఆన్‌లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ippbonline.bank.in/
Similar News
News December 1, 2025
జగిత్యాల: బుజ్జగింపులు.. బేరసారాలు

జగిత్యాల జిల్లాలో తొలి విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ముగిసి నేటి నుంచి 3 రోజులు విత్‌డ్రాకు గడువు ఉండడంతో అభ్యర్థులు బుజ్జగింపులు, బేరసారాలకు దిగుతున్నారు. తనకు మద్దతుగా విత్ డ్రా చేసుకోవాలని పలువురు అభ్యర్థులు తనకు పోటీగా నామినేషన్లు వేసిన అభ్యర్థులను బుజ్జగిస్తూ బేరసారాలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు.
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
News December 1, 2025
కిచెన్ టిప్స్.. మీ కోసం..

* సొరకాయ మిగిలిపోయినపుడు కుళ్లిపోకుండా ఉండాలంటే.. ఆ వైపును అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టాలి.
* గాజు గ్లాసులను తరలించేటప్పుడు వాటికి కాటన్ క్లాత్/ సాక్స్‌లు తొడిగితే ఒకదానికొకటి తగిలినా పగలవు.
* కేక్ మిశ్రమంలో టీ స్పూన్ గ్లిజరిన్ కలిపితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* వాటర్ బాటిల్‌ను వాడకుండా ఉంచితే దుర్వాసన వస్తుంది. ఇలా జరగకూడదంటే అందులో యాలకులు/లవంగాలు/ దాల్చిన చెక్క ముక్క వేసి ఉంచండి.


