News November 30, 2025
813 సర్పంచ్, 3485 వార్డ్ మెంబర్లు నామినేషన్ దాఖలు

చివరి రోజు నామినేషన్ గడువు ముగిసే సమయానికి తొలి విడతలోని 8 మండలాల నుంచి దాఖలైన సర్పంచ్, వార్డు మెంబర్ నామినేషన్ వివరాలు.
అశ్వాపురం – 132, 553
భద్రాచలం – 11, 98
బూర్గంపాడు – 114, 483
చర్ల – 134, 485
దుమ్ముగూడెం – 153, 648
కరకగూడెం – 67, 278
మణుగూరు – 83, 431
పినపాక – 119, 529
మొత్తం సర్పంచ్ నామినేషన్లు 813, వార్డు మెంబర్ 3485 మంది దాఖలు చేశారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రకటించారు.
Similar News
News December 1, 2025
సిద్దిపేట: సర్పంచ్ స్థానాలకు 747 నామినేషన్లు వ్యాలిడ్

సిద్దిపేట జిల్లాలో మొదటి విడతలో ఏడు మండలాల్లోని 163 గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. మొత్తం 953 నామినేషన్లు దాఖలు కాగా, అందులో 747 నామినేషన్లు వ్యాలిడ్‌గా తేల్చారు. వార్డు స్థానాలకు 3504 నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల పరిశీలన అనంతరం 3429 నామినేషన్లు వ్యాలీడ్‌గా అధికారులు ప్రకటించారు.
News December 1, 2025
సిద్ధిపేట: విధుల్లో నిర్లక్ష్యం.. నలుగురికి షోకాజ్ నోటీసులు

సిద్దిపేట జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు కలెక్టర్ హైమావతి నోటీసులు ఇచ్చారు. బెజ్జంకి మండల రిటర్నింగ్ అధికారి బాలకిషన్, సహాయ రిటర్నింగ్ అధికారి పరమేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు. వీరికి సరైన రిపోర్ట్ ఇవ్వని మండల పంచాయతీ అధికారులు ఖాజా మొయినొద్దీన్, కలింలకు కూడా నోటీసులు పంపినట్టు తెలిపారు.
News December 1, 2025
WGL: నేటి నుంచి కొత్త మద్యం దుకాణాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 294 మద్యం షాపులకు టెండర్లను పిలవగా, 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు రూ.314.79 కోట్ల ఆదాయం జమ అయ్యింది. కొత్త మద్యం షాపులు రెండేళ్ల పాటు ఉండనున్నాయి. కొత్త షాపులకు గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మేడారం జాతర కలిసి వచ్చేలా చేసింది.


