News November 30, 2025

పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ నామినేషన్లు ఎన్నంటే..?

image

పెద్దపల్లి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. గడువు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 99 గ్రామపంచాయతీలకు 823 నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా.. కమాన్ పూర్ 93, మంథని 270, ముత్తారం 128, రామగిరి 160, శ్రీరాంపూర్ 172 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు.

Similar News

News March 21, 2026

IPL స్పెషల్: గిల్‌క్రిస్ట్ దెబ్బకు ఢిల్లీ ఇంటికి..

image

IPL-2009లో డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్ గిల్‌క్రిస్ట్ అద్భుత ఇన్నింగ్సుతో టేబుల్ టాపర్ ఢిల్లీని ఇంటికి పంపించారు. ఢిల్లీలో వార్నర్, గంభీర్, సెహ్వాగ్, దిల్షాన్, ABD లాంటి దిగ్గజాలు ఉండేవారు. సెమీఫైనల్లో వారందరూ రన్స్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 20 ఓవర్లలో 153 రన్స్ మాత్రమే చేశారు. గిల్‌క్రిస్ట్ ఓపెనర్‌గా వచ్చి 35 బంతుల్లోనే 85 రన్స్ చేశారు. దీంతో మ్యాచ్ వన్ సైడ్ అయిపోయింది. DC ఫైనల్‌కు వెళ్లింది.

TG SET ఫలితాలు విడుదల

image

TG సెట్-2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 2,565 మంది అర్హత సాధించారు. అధికారిక <>వెబ్‌సైట్‌<<>>లో రిజర్వేషన్ల వారీగా అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు పొందుపరిచారు. హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్‌కార్డును పొందవచ్చు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ పరీక్ష జరిగింది. మరోవైపు టీజీ సెట్‌-2026 నోటిఫికేషన్​ మే నెలలో విడుదలవనుంది. అక్టోబర్‌లో ఎగ్జామ్ జరగనుంది.