News November 30, 2025

అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.

Similar News

News December 1, 2025

అమరావతిలో సచివాలయ టవర్‌లకు అరుదైన రికార్డ్‌లు

image

అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నిర్మాణ దశలోనే ఇవి పలు అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ‘డయాగ్రిడ్’ నిర్మాణం. దీనివల్ల పిల్లర్ల సంఖ్య తగ్గి, భవనం అద్భుతంగా కనిపిస్తుంది. జపాన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ ఎత్తైన సచివాలయ టవర్‌గా (212 మీటర్లు) ఇది రికార్డు సృష్టించనుంది. ఇది 200 మీటర్ల ఎత్తు దాటిన ఏపీలోని మొదటి స్కైస్క్రాపర్.

News December 1, 2025

డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

image

హీరో ధనుష్‌తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్‌తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.

News December 1, 2025

త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి దుర్గేశ్

image

సినిమా షూటింగ్‌‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా APని నిలుపుతామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ‘త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తాం. మీడియా, ఎంటర్టైన్‌మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహం కల్పిస్తాం. కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం. నంది అవార్డుల ప్రదానోత్సవం, నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహిస్తాం’ అని ముంబైలో ‘CII బిగ్ పిక్చర్ సమ్మిట్’లో వెల్లడించారు.