News November 30, 2025

దిత్వ తుఫాన్.. సూర్యాపేట ఎస్పీ సూచన

image

దిత్వ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు, చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. అత్యవసరమైతే తప్పా ఎవరూ బయటకు రాకూడదని, ధాన్యాన్ని కప్పి ఉంచాలన్నారు. సహాయం కోసం డయల్ 100 లేదా కంట్రోల్ రూమ్ 8712686026కు ఫోన్ చేయాలన్నారు.

Similar News

News April 1, 2026

వరంగల్: నేటి నుంచే 10TH పేపర్ల మూల్యాంకనం

image

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నేటి నుంచి కాజీపేటలోని ఫాతిమా హై స్కూల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 23 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియలో సుమారు 2.40 లక్షల పేపర్లను మూడు విడతల్లో దిద్దనున్నారు. ఏప్రిల్ 1– 9 వరకు భాషలు, గణితం, 10– 17 వరకు సైన్స్, 18– 23 వరకు సాంఘికం, వొకేషనల్ పేపర్లు మూల్యాంకనం చేయనున్నారు. ఏర్పాట్లను డీఈవో ఎల్వీ గిరిరాజ్ గౌడ్ పరిశీలించారు.

News April 1, 2026

హనుమకొండ: రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద రాత్రి వరకు రద్దీ

image

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. హనుమకొండలో సాధారణంగా రోజుకు 108 స్లాట్లు ఉండగా, ఈనెల 28 నుంచి 31 వరకు అదనంగా 80 స్లాట్లను పెంచారు. ఈనెల 28న 150, 30న 170 రిజిస్ట్రేషన్లు జరిగాయి. మంగళవారం సాయంత్రం వరకు 120 స్లాట్లు బుక్ కాగా, 112 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నిన్న చివరిరోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజలు బారులు తీరారు.

News April 1, 2026

ఉమ్మడి వరంగల్‌లో చికెన్ సెంటర్ల నిరవధిక బంద్

image

ఉమ్మడి జిల్లాలో నేటి నుంచి చికెన్ సెంటర్లు నిరవధిక బంద్‌ను పాటించనున్నాయి. బ్రాయిలర్ కోళ్ల సరఫరా కంపెనీలు సిండికేట్‌గా ఏర్పడి మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ, మార్జిన్ తగ్గించడంతో తీవ్ర నష్టాలు చూస్తున్నామని షాపుల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 3,500 చికెన్ సెంటర్లు ఉండగా, రోజుకు 500 టన్నుల అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ రంగంపై దాదాపు 17,500ల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.