News November 30, 2025

ADB: యోగా ఫలితాలు ఎప్పుడు సారూ..!

image

KU అనుబంధం ఉన్న SDLCEలో పరీక్షలు పెట్టడం, ఫలితాలు మరిచిపోవడం ఈ మధ్య ఎక్కువైంది. గతేడాది తీసుకొచ్చిన కొత్త కోర్సు డిప్లొమా ఇన్ యోగా పరీక్షలను ఆగస్టు 12 నుంచి 18 వరకు నిర్వహించారు. పరీక్షలు జరిగి 4 నెలలవుతున్నా ఫలితాలు ప్రకటించకపోవడంతో, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నామని అభ్యర్థులు వాపోతున్నారు. యోగా డిప్లొమా ఉంటే యోగా టీచర్ ఉద్యోగాలు వస్తాయని, ఈ ఫలితాలు ప్రకటించకపోవడం మూలంగా నష్టపోతున్నామంటున్నారు.

Similar News

News March 25, 2026

ఇరాన్ మైండ్ గేమ్: చమురు అస్త్రం సక్సెస్?

image

అగ్రరాజ్యాన్ని ఎదిరించి ఇరాన్ తన పంతం నెగ్గించుకుంది. యుద్ధంతో కలిగించే నష్టాల కంటే సుదీర్ఘ ఘర్షణతో గ్లోబల్ ఆయిల్ సంక్షోభం సృష్టించాలనే ఇరాన్ మైండ్ గేమ్ ఫలించిందని నిపుణులు అంటున్నారు. ఇంధన కొరత భయంతో ట్రంప్ వెనక్కి తగ్గడం, హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును అంగీకరించడం ఆ దేశ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. నాయకత్వ మార్పు కోరుకున్న US చివరకు అదే నాయకత్వంతో రాజీకి రావడం ఇరాన్ సక్సెస్‌ను చాటిచెబుతోంది.

News March 25, 2026

ఈ నెలాఖరులోగా డీసీసీ పూర్తి కార్యవర్గం!

image

ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీసీసీ కార్యవర్గాల ప్రకటన ఈ నెలాఖరులోగా వెలువడే అవకాశం ఉంది. 4 నెలల క్రితమే జిల్లా అధ్యక్షులను నియమించినప్పటికీ, పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటులో జరిగిన జాప్యం ద్వితీయ శ్రేణి నాయకుల్లో నిరుత్సాహాన్ని నింపింది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కమిటీల ప్రతిపాదనలు అందడంలో ఆలస్యం కావడం వల్లే NLG, SRPT జిల్లాల కార్యవర్గాల ప్రకటన నిలిచిపోయింది.

News March 25, 2026

జగిత్యాల: వివిధ దినుసులు ధరలు ఇలా..!

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ.11,900, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,500, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,880, కనిష్ఠం రూ. 1,606, కందులు గరిష్ఠం రూ. 6,889, కనిష్ఠం రూ. 6,050, అనుములు గరిష్ఠం రూ. 5,152, కనిష్ఠం రూ. 4,000గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.