News November 30, 2025
రేపు నూజివీడులో PGRS కార్యక్రమం

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని పట్టణ, గ్రామాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రజల అర్జీలు ఆన్‌లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరిస్తామన్నారు.
Similar News
News March 16, 2026
సమస్యలు ఉంటే నేరుగా ఫిర్యాదు చేయండి: ఎస్పీ

సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎస్పీ పరితోష్ పంకజ్ విన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 12 మంది తమ ఫిర్యాదులను వివరించారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిఐలకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు.
News March 16, 2026
జగిత్యాల: ప్రజావాణికి 57 ఫిర్యాదులు

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణిలో ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. అధికారులు అర్జీలపై సమగ్ర విచారణ జరిపి పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజావాణికి మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News March 16, 2026
GWL: ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా ఉండాలి- కలెక్టర్

డిజిటల్ క్రాఫ్ట్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీ పక్కాగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సోమవారం మండలంలోని గోనుపాడు శివారులో పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి పంటల దిగుబడి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరో నెల రోజుల్లో అన్ని పంటలు చేతికి వస్తాయని రైతులు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.


