News November 30, 2025

తిరుపతి రుయాలో రూ.50వేల ఇంజెక్షన్ ఫ్రీ

image

బ్రెయిన్ స్ట్రోక్ అత్యంత ప్రమాదకరం. చికిత్సకు రూ.లక్షలు ఖర్చు చేయాలి. తిరుపతి రుయాలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మంగళ, శుక్రవారం న్యూరాలజీ OP ఇస్తారు. అత్యవసర వైద్యం 24గంటలు అందిస్తారు. చేయి, కాలు, మాట పడిపోవడం, మూతి వంకర పోవడం, కళ్లు కనిపించకపోవడం బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు. సకాలంలో గుర్తించి ఇక్కడికి తీసుకొస్తే రూ.50వేల విలువైన ఇంజెక్షన్ వేస్తారు. 90శాతం ప్రాణాపాయం తప్పుతుంది.

SHARE IT.

Similar News

News April 1, 2026

కడప: AMCల టార్గెట్ 14.27 కోట్లు.. వసూలు ఎంతంటే.!

image

కడప జిల్లాలో 11 AMCలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లా టార్గెట్ రూ.14.27 కోట్లు కాగా.. మార్కెట్ సెస్ రూపంలో రూ.13.37 కోట్లు ఆదాయం సాధించాయి.
AMCల వారీగా ఆదాయం వివరాలు (కోట్లలో).
కడప-2.21, ప్రొద్దుటూరు-1.61, బద్వేల్-2.21.
జమ్మలమడుగు-0.95, పులివెందుల-1.15, రాజంపేట-0.59.
మైదుకూరు-2.33, కమలాపురం-1.00, సిద్ధవటం-0.28.
ఎర్రగుంట్ల-0.75, సింహాద్రిపురం-0.25 కోట్లు ఆదాయం లభించింది.

News April 1, 2026

కడప జిల్లాలో కేటగిరీలవారీగా పెన్షన్ల వివరాలు ఇలా.!

image

కడప జిల్లాలో ప్రభుత్వం 25 రకాల పెన్షన్లను 2,80,138 మందికి రూ.122.31 కోట్లు పంపిణీ చేస్తోంది.
వృద్ధులు-139343, వితంతువులు-71613.
దివ్యాంగులు-39383, చేనేతలు-9352.
అభయహస్తం-7431, ఒంటరి మహిళలు-4140.
డప్పు వాయిద్యకారులు-3562, చర్మకారులు-2090.
పెరాలసిస్-772, మత్స్యకారులు-535, లివర్ కిడ్నీ మార్పిడి-47.
లెప్రసీ-356, CKDU-648, కళాకారులు-109.
తలసేమియా-85, ట్రాన్స్జెండర్స్-131 మంది ఉన్నారు.

News April 1, 2026

కడప జిల్లాలో NRT భరోసా పెన్షన్లు ఎన్నంటే.!

image

కడప జిల్లాలో NTR భరోసా పెన్షన్లు 2,80,138 ఉన్నాయి.
వీరికి ఏప్రిల్ నెలకు రూ.122.31 కోట్లు విడుదలయ్యాయి.
నియోజకవర్గాల వారీగా పెన్షన్ల సంఖ్య, అమౌంటు.
*బద్వేర్-36,582 – ₹.16.19,
*జమ్మలమడుగు-40,789 – ₹.27.68,
*కడప-27,420 – ₹.12.08,
*కమలాపురం-32,062 – ₹.13.96,
*మైదుకూరు-34,339 – ₹.14.86,
*ప్రొద్దుటూరు-32,418 – ₹.13.91,
*పులివెందుల-40,220 – ₹.17.88,
*రాజంపేట-36,308 – ₹.15.72 కోట్లు