News November 30, 2025

జగిత్యాల: సర్పంచ్ కు 848.. వార్డు మెంబర్ కు 2572

image

JGTL జిల్లాలో మొదటి విడత 122 GP ఎన్నికలకు సర్పంచ్ కు 848, వార్డు మెంబర్ కు 2572 నామినేషన్లు వచ్చాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సర్పంచ్ స్థానాలకు భీమారం మండలంలో 87, కథలాపూర్ 131, మల్లాపూర్ 180, KRTL 108, MTPL 161, ఇబ్రహీంపట్నం 99, మేడిపల్లి 82 వచ్చాయన్నారు. వార్డు మెంబర్ కు భీమారం 271, కథలాపూర్ 472, మల్లాపూర్ 474, KRTL 372, మెట్పల్లి 403, ఇబ్రహీంపట్నం 314, మేడిపల్లి మండలంలో 266 వచ్చాయన్నారు.

Similar News

News March 7, 2026

HYDలో హాకీ సమరం.. కెప్టెన్లకు ఘన స్వాగతం

image

హైదరాబాద్ నగరంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న FIH మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్-2026 వేడుకలు మొదలయ్యాయి. ఈ టోర్నీలో పాల్గొనే భారత్, ఇంగ్లాండ్, కొరియా సహా 8 దేశాల కెప్టెన్లకు క్రీడా శాఖ అధికారికంగా స్వాగతం పలికింది. భారత జట్టుకు సలీమా టెటె నాయకత్వం వహిస్తుండగా.. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచిన జట్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తాయి. భాగ్యనగరంలో అంతర్జాతీయ హాకీ సందడి నెలకొంది.

News March 7, 2026

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: DMHO సుజాత

image

మహిళలు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా వైద్యాధికారి సుజాత అన్నారు. శనివారం వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాధాశ్రమంలో మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఆరోగ్యశాఖ మహిళా ఉద్యోగులకు తేడా పోటీలు నిర్వహించి ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. అనాధ బాలల మధ్య ఈ వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News March 7, 2026

ASF: PM సూక్ష్మ ఆహార పరిశ్రమల పథకం ప్రారంభం

image

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకంలో రాయితీ రుణాల ద్వారా ఆదాయ అభివృద్ధి జరుగుతుందని ఆసిఫాబాద్ DRDA దత్తారావు శనివారం తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు 35% రాయితీ, 65% బ్యాంకు రుణంతో పరిశ్రమలు స్థాపించుకోవచ్చని, 100 యూనిట్లు కేటాయించబడ్డాయని, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేయాలని సూచించారు.