News November 30, 2025

VZM: ‘గురజాడ నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలి’

image

గురజాడ అప్పారావు నివాసాన్ని జాతీయ స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, సామాజిక వేత్త దేవి డిమాండ్ చేశారు. ఆదివారం విజయనగరంలో గురజాడ వర్ధంతి సందర్భంగా జరిగిన గౌరవ యాత్రలో వారు పాల్గొన్నారు. గురజాడ ప్రపంచానికి తెలుగు భాష ఔనిత్యాన్ని చాటి చెప్పిన మహా కవి అన్నారు. గురజాడ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

Similar News

News March 16, 2026

VZM: 22ఏ నిషేధిత జాబితా నుంచి 13 మంది రైతులకు విముక్తి

image

రెవెన్యూ క్లినిక్స్ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తోందని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో భాగంగా 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన 13 మంది రైతులకు ఆయన ఉత్తర్వులు అందజేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు రికార్డులు పరిశీలించి భూములు ప్రభుత్వానికి సంబంధించినవి కావని నిర్ధారించారు.

News March 16, 2026

VZM: పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం

image

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 22,940 మంది హాజరయ్యారని DEO మాణిక్యం నాయుడు తెలిపారు. మొత్తం 75 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షకు 455 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా, 423 మంది హాజరయ్యారన్నారు. మొత్తం 32 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు.