News November 30, 2025
తిరువూరు MLA సంగతి నేను చూసుకుంటా: చంద్రబాబు

తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలిపై CM చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన వ్యాఖ్యల్లో మార్పు లేకపోవడంపై మండిపడ్డారు. ఇటీవల “తనను గెలిపించింది ప్రజలేనని” MLA చేసిన వ్యాఖ్యలను CM తీవ్రంగా పరిగణించారు. పార్టీ అవసరం లేదనుకుంటే బయటకు వెళ్లి బలం నిరూపించుకోవచ్చని స్పష్టం చేశారు. MLAను పిలిచి మాట్లాడుతానని చంద్రబాబు అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News March 7, 2026
దేశంలోనే అతిపెద్ద లొంగుబాటు: రేవంత్

TG: దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద మావోయిస్టు <<19321592>>లొంగుబాటు<<>> అని CM రేవంత్ అన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మిగతావాళ్లంతా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. గణపతి రక్షణ, ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదే అని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోలకు ఆరోగ్య, ఆర్థిక భద్రతకు ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నామన్నారు. మావోలు లేవనెత్తిన రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
News March 7, 2026
భద్రాద్రి: మనోడి సినిమాకు ‘గద్దర్’ అవార్డుల పంట

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘గద్దర్’ అవార్డుల్లో ఇల్లందు(M) కొమరానికి చెందిన సాయిలు కాంపాటి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. ఆయన తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం ఉత్తమ సినిమాగానూ నిలిచింది. ఇదే చిత్రంలో నటించిన చైతు జొన్నలగడ్డ ఉత్తమ నటుడిగా, అనురాగ్ ఉత్తమ గాయకుడిగా అవార్డులు దక్కించుకున్నారు. 4 రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికవ్వడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 7, 2026
భిక్కనూర్: పురుగుల అన్నంపై విచారణ

భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో పురుగుల అన్నంపై శనివారం విచారణ జరిపారు. విద్యార్థులకు పురుగులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థులు పారబోశారు. దీనిపై విచారణ జరిపించాలని ఎన్సీడీ వైద్యాధికారి శిరీషను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు ఆమె పాఠశాలకు వెళ్లి బియ్యాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. అనంతరం వివరాలు సేకరించారు.


