News November 30, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతల అప్డెడేట్

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో సాలూర 10.9°C, చిన్న మావంది 11.2, నిజామాబాద్ సౌత్, మదనపల్లి, నిజామాబాద్ నార్త్ 11.8, జాకోర 11.9, కోటగిరి, కల్దుర్కి, పొతంగల్ 12.0, గూపన్ పల్లి 12.1, రుద్రూర్ 12.3, చందూర్, బెల్లాల్ 12.4, ఎడపల్లి 12.7, మల్కాపూర్, నవీపేట్‌లో 12.9°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News March 30, 2026
NZB: ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ జిల్లా కమిషనర్‌గా బానేశ్ జాడి

ది స్కౌట్/గైడ్స్ ఆర్గనైజేషన్ (SGO) నిజామాబాద్ జిల్లా కమిషనర్‌గా బానేశ్ జాడి నియమితులయ్యారు. నేషనల్ కమిషనర్ ఆఫ్ ఇండియా (న్యూఢిల్లీ) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ అశోక్ రాజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కాగా జిల్లాలో SGO బలోపేతానికి, విద్యార్థులలో క్రమశిక్షణ, సేవా భావాన్ని పెంపొందించడానికి కృషి చేస్తానని బానేశ్ జాడి తెలిపారు.
News March 30, 2026
NZB: 17 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 17 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కొన్నారు. పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు CP చెప్పారు.
News March 30, 2026
NZB: పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేయాలి: కలెక్టర్

పదో తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహశీల్దార్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


