News November 30, 2025
పాలమూరు: పంచాయతీలలో ఏకగ్రీవాల జోరు!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవాలు అయ్యాయి. వేలం పాటలు, ఒప్పందాల ద్వారా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్‌తో సహా 10 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం ప్రధానాంశంగా నిలిచింది. గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనూ ఏకగ్రీవాలు నమోదయ్యాయి.
Similar News
News March 6, 2026
ఈరోజు నమాజ్ వేళలు (06-3-2026) శుక్రవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.19 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.31 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: మధ్యాహ్నం 3.50 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.25 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.37 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 6, 2026
తిరుపతి: ఫలితాలు వచ్చేశాయ్.!

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది ఏప్రిల్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ రెండో సెమిస్టర్, డిసెంబర్ నెలలో డిగ్రీ B.A/ B.Com/ B.Sc/ B.B.A/ B.C.A/ B.Voc మూడో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.
News March 6, 2026
100% ఉత్తీర్ణతే లక్ష్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్: DEO

ప్రభుత్వ పాఠశాలల్లో 10 తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభా స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించి ప్లాన్ ప్రకారం బోధన చేయిస్తున్నట్లు చెప్పారు.


