News November 30, 2025
జగిత్యాల: బాధితులకు తక్షణ సహాయం: కలెక్టర్

జగిత్యాల జిల్లా కొండగట్టులో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా 20 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసులు స్పందించి మంటలను ఆర్పారు. బాధితులను స్థానిక పాఠశాలకు తరలించి ఆహారం, వస్త్రాలు అందించారు. జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Similar News
News March 14, 2026
NGKLలో నిప్పుల కొలిమి.. 39 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కల్వకుర్తిలో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాలైన శిరసనగండ్ల (38.9°C), వెల్టూర్, పెద్దకొత్తపల్లి (38.8°C)లలో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
News March 14, 2026
అమెరికాలో వరంగల్ ఉపాధ్యాయురాలి మృతి

వరంగల్ నగరం దేశాయిపేట రోడ్డు రామనాథపురి కాలనీకి చెందిన చిదురాల విజయరాణి(55) అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆమె పైడిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తన చిన్న కుమార్తె పూజ ప్రసవం కావడంతో, మనవడిని చూసేందుకు ఆమె అమెరికా వెళ్లారు. రెండు రోజుల క్రితం హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడి ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.
News March 14, 2026
భీమిలి: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య

భీమిలి పరిధి కాపుల ఉప్పాడలో ఉంటున్న అప్పలరాజు కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పలరాజు తీవ్రంగా గాయపడడంతో గీతం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఇక్కడి నుంచి కేజీహెచ్‌కి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు భీమిలి పోలీసులు తెలిపారు.


