News November 30, 2025

ఆన్‌లైన్‌లో సింహాచలం దర్శనం‌ టికెట్స్

image

సింహాచలం వచ్చే భక్తులకు గుడ్‌న్యూస్. దేవదాదాయ శాఖ సూచనల మేరకు దేవస్థానం వసతి గదులు, దర్శనాలు, ప్రత్యేక పూజలు, ఇతర సేవల బుకింగులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకోచ్చినట్లు ఈవో సుజాత ఆదివారం తెలిపారు. వీరికి ప్రత్యేక మార్గం ద్వారా దర్శనం, ప్రత్యేక లడ్డు ప్రసాదం కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు. భక్తులు www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా, వాట్సాప్ నంబరు 9552300009 ద్వారా బుక్ చేసుకొవచ్చని చెప్పారు.

Similar News

News March 19, 2026

పాలమూరు నేలకు కేంద్రం జలసంజీవని..!

image

నిరంతరం కరువు పరిస్థితులు ఎదుర్కొనే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎంపిక చేసిన మండలాల్లో నీటి సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. వాన నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మొత్తం రూ.100 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేయగా, తొలి విడతగా రూ.50 కోట్లు విడుదలయ్యాయి. రైతు భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావడమే ఈ పథకం ఉద్దేశం .

News March 19, 2026

శ్రీశైలం: ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు

image

నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మరో కర్ణాటక, మహారాష్ట్రను తలపిస్తోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా క్షేత్ర పరిధిలో చూసినe కన్నడ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది. తమ పుట్టింటి ఆడపడుచుకు సారే సమర్పించేందుకు కన్నడిగులు శ్రీశైలం తరలివచ్చారు. తొలి తెలుగు సంవత్సరం ప్రారంభం ఉగాది పర్వదినాన స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1,03,655 మంది భక్తులు దర్శించుకున్నారు.

News March 19, 2026

MBNR: ఉగాది, రంజాన్ EFFECT.. రద్దీ

image

ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏర్పడింది.