News November 30, 2025

టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా

image

రాంచీ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. SA కెప్టెన్ బవుమా రెస్ట్ తీసుకున్నారు.
IND టీమ్: KL రాహుల్(C), జైస్వాల్, రోహిత్, కోహ్లీ, రుతురాజ్, సుందర్, కుల్దీప్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, జడేజా, హర్షిత్.
SA టీమ్: రికెల్టన్, డికాక్, మార్క్రమ్(c), బ్రిట్జ్కే, జోర్జీ, బ్రెవిస్, జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రెనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మన్.

Similar News

News March 24, 2026

మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

image

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.

News March 24, 2026

కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

image

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.

News March 24, 2026

IPLకు ముందు సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన గిల్

image

IPLకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన సక్సెస్ సీక్రెట్‌ను పంచుకున్నారు. తనలోని ప్రశాంతతకు తనపై తనకు ఉన్న నమ్మకం, జట్టు ఇచ్చే భరోసాయే కారణమని తెలిపారు. సోమవారం జరిగిన ‘శుభారంభ్ 2026’ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రశాంతంగా ఉండటం వల్ల పరిస్థితులను స్పష్టంగా అంచనా వేయొచ్చని, అది లాంగ్ టర్మ్ విజన్ ఇస్తుందని చెప్పారు. కోచ్ ఆశిష్ నెహ్రా కూడా తమ లక్ష్యం గెలవడమేనని స్పష్టం చేశారు.