News November 30, 2025
ప్రకాశం జిల్లాలో వారికి సెలవులు రద్దు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని విద్యుత్తు శాఖ సిబ్బందికి 3రోజులు సెలవులు రద్దు చేశామని ఎస్ఈ కట్టా వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఒంగోలులోని విద్యుత్ భవన్‌లో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వర్షాల సమయంలో మోటార్లు, స్తంభాల వద్దకు వెళ్లకుండా ఉండడమే మంచిదని సూచించారు. అత్యవసర సమయాల్లో 9440817491కు కాల్ చేయాలని కోరారు.
Similar News
News March 17, 2026
దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రకాశం: బాలికపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు

10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. బేస్తవారిపేట(M) పూసలపాడుకు చెందిన మోతుకూరి కోలా పిచ్చయ్య(31)పై కేసు నమోదై దర్యాప్తు దర్వాప్తు నేరం రుజువైంది. ఈ సందర్భంగా బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్లు SP తెలిపారు. ముద్దాయికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసులను SP అభినందించారు.