News November 30, 2025
కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో తొలిసారి ‘కీ హోల్’ సర్జరీలు

కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో మొదటిసారిగా ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీలు విజయవంతంగా జరిగాయి. భద్రాచలంకు చెందిన 26 ఏళ్ల ఎన్. ఠాగూర్, కొత్తగూడెంకు చెందిన 35 ఏళ్ల టి. స్రవంతి వేర్వేరు సందర్భాలలో తమ కుడి మోకాలికి దెబ్బ తగలడంతో ఆర్థోపెడిక్ డాక్టర్లను సంప్రదించారు. అధునాతన సదుపాయాలతో ఆర్థోపెడిక్ డాక్టర్ల బృందం వారికి శస్త్ర చికిత్స చేసి, వారి ఆరోగ్య సమస్యను విజయవంతంగా పరిష్కరించారు.
Similar News
News March 12, 2026
దేవరపల్లి: లారీ ఢీకొని రిటైర్డ్ వ్యవసాయాధికారి మృతి

దేవరపల్లి మండలం కృష్ణంపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాంధీనగరం గ్రామానికి చెందిన రిటైర్డ్ వ్యవసాయ శాఖ AD ఆచంట జగన్నాథరావు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మరణించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గాంధీనగరంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
News March 12, 2026
ఎక్కువ రేట్లకు సిలిండర్లు అమ్ముతున్నారా.. కాల్ చేయండి.!

గ్యాస్ సిలిండర్లపై అసత్య వార్తలు ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. సిలిండర్ల కొరత, ధరలు పెరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అధిక ధరకు సిలిండర్లు విక్రయిస్తే 112 సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని విశ్వసించాలన్నారు.
News March 12, 2026
MNCL: క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మై భారత్ ఆధ్వర్యంలో క్లస్టర్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రన్నింగ్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.


