News November 30, 2025

సిరిసిల్ల: కాంగ్రెస్ నేతలకు గజమాలతో సత్కారం

image

సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ నేతలను అభిమానులు గజమాలతో సత్కరించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రమాణస్వీకారం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్ లకు భారీ పూలమాల వేసి సత్కరించి అభిమానం చాటుకున్నారు.

Similar News

News March 14, 2026

మాది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం: పవన్ కళ్యాణ్

image

నందిగరువులో నిర్వహించిన మాటా మంతీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజనుల సమస్యలు విని కొన్ని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, అందుకే నేరుగా వచ్చి సమస్యల వింటున్నామన్నారు. గత ప్రభుత్వంలో నిధుల మళ్లింపుతో ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి పోయిందని, తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గిరిశిఖర గ్రామాల్లో 460 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామన్నారు.

News March 14, 2026

GWL: సిలిండర్లు బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు

image

గృహ వినియోగానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గద్వాల కలెక్టర్ రిజ్వానా బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్‌లో పోలీసు, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్యాస్ సమస్యల తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లుకు గ్యాస్ కొరత లేకుండా చూడాలన్నారు.

News March 14, 2026

కోదాడలో 42 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం

image

కోదాడ పట్టణంలోని అంబేడ్కర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన 42 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఇంట్లో డొమెస్టిక్ సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లలోకి గ్యాస్ మారుస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా రీఫిల్లింగ్ పరికరాలను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను శ్లోక గ్యాస్ గోదాముకు తరలించారు.