News November 30, 2025

ప్రకాశం: సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ వద్దు..!

image

సెల్‌ఫోన్ చూస్తూ, మాట్లాడుతూ.. డ్రైవింగ్ చేస్తే, ప్రమాదాలను ఆహ్వానించినట్లేనని ప్రకాశం పోలీసులు వాహనదారులకు సూచించారు. ప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని కోరారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు.

Similar News

News February 11, 2026

జిల్లా ప్రజలకు ప్రకాశం ఎస్పీ కీలక సూచనలు

image

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రముఖ ఆలయాల వద్ద చర్యలు చేపట్టామన్నారు. ఏదైనా సాయం కోసం డయల్ 100 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

News February 11, 2026

ప్రకాశం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని DEO రేణుక తెలిపారు.

News February 11, 2026

ప్రకాశం: మల్లన్న దర్శనాలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. పులి సంచారం

image

నల్లమల అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్తున్న భక్తులకు మంగళవారం పెద్దపులి కంటబడింది. పెచ్చేరువులో అన్నదాన శిబిరానికి సరుకులు రవాణా చేస్తున్న వాహనదారులకు ఓ పెద్ద పులి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు తమ మొబైల్స్‌లో పెద్ద పులిని చిత్రీకరించారు. కాగా అభయారణ్యంలో కాలినడకన వెళ్లే భక్తులు జాగ్రత్తలు వహించాలని అటవీ అధికారులు సూచిస్తున్నారు.