News November 30, 2025

అనంతపురం జిల్లాలో పెద్ద మండలం ఏదంటే?

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైశాల్యం పరంగా ముదిగుబ్బ మండలం అతిపెద్దది. దీని విస్తీర్ణం 553.95 కి.మీ². అలాగే అగలి మండలం 123.36 కి.మీ² విస్తీర్ణంతో అతి చిన్న మండలం. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో అత్యధిక జనాభా కలిగిన మండలం అనంతపురం కాగా, గాండ్లపెంట అత్యల్ప జనాభా కలిగిన మండలం. రాష్ట్రంలో మొత్తం 19,130 కిమీ² (7,390 చదరపు మైళ్లు) వైశాల్యంతో అనంతపురం రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా.

Similar News

News March 24, 2026

మూసీ ప్రక్షాళన.. మార్పు మనతోనే మొదలవ్వాలి!

image

ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజల భాగస్వామ్యం లేనిదే మూసీ ప్రక్షాళన సాధ్యం కాదు. మన ఆలోచనా విధానం మారాలి. ప్లాస్టిక్ సహా ఇతర వ్యర్థాలను నేరుగా నదిలో వేయడం ఆపాలి. డ్రైనేజీ కనెక్షన్లను పద్ధతిగా ఉంచుకోవడం, నీటిని పొదుపుగా వాడుతూ మురుగును తగ్గించడం మన బాధ్యత. నదిని చెత్తకుప్పగా కాకుండా నగర జీవనాడిలా గౌరవించాలి. పౌరుల క్రమశిక్షణ, ప్రభుత్వ సంకల్పం తోడైతేనే స్వచ్ఛమైన మూసీ కల నెరవేరుతుంది.

News March 24, 2026

కొలంబియా విమాన ప్రమాదం.. 8 మంది మృతి!

image

కొలంబియా మిలిటరీ విమాన <<19460361>>ప్రమాదం<<>>లో 8 మంది మృతి చెందారు. సోమవారం 125 మందితో బయలుదేరిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. సుమారు 80 మంది గాయపడ్డట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరికొంత మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డట్లు వెల్లడించాయి. డ్రగ్ కార్టెల్స్ ఏరివేతలో భాగంగా సరిహద్దుకు వెళ్తుండగా ఈ విషాదం జరిగింది.

News March 24, 2026

SRPT: సబ్సిడీ వాహనాల దరఖాస్తులకు నేడే లాస్ట్

image

ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా స్వయం ఉపాధి పొందే ఎస్సీ యువతకు 70-90% సబ్సిడీపై ఈవీ టూవీలర్లు, ఆటోలు, సోలార్ పంపుసెట్లను ప్రభుత్వం అందిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో 929 యూనిట్లకు సబ్సిడీ ఇవ్వనున్నారు. అర్హులు ఈనెల 24లోగా tgobmms.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈవీ వాహనాలకు అప్లై చేసుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.