News April 18, 2024

విశాఖ: ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ఆవరణలో ఇటీవల జరిగిన హోలీ వేడుకల్లో కొందరు విద్యార్థులు ‘జగనన్న’ పాటకు నృత్యాలు చేశారన్న విషయమై విచారణ కొనసాగుతోంది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని ఎన్నికల సంఘం కోరడంతో 3వ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కి చెందిన ఒక అధికారి న్యాయ కళాశాలకు వెళ్లి అధికారులను విచారించినట్లు తెలిపారు.

Similar News

News October 8, 2025

కేజీహెచ్‌లో 46 మంది విద్యార్థులకు చికిత్స

image

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల సంఖ్య 46కి తగ్గింది. మొత్తం 64 మంది ఆస్పత్రిలో చేరగా.. వీరిలో మంగళవారం 8 మందిని డిశ్చార్జ్ చేసి పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. బుధవారం మరో 10 మందిని డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. ప్రస్తుతం 46 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆమె వెల్లడించారు.

News October 8, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో అమ్రిత్ సంవాద్ కార్యక్రమం

image

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో బుధవారం వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారి ‘అమ్రిత్ సంవాద్’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డీసీఎం పవన్ కుమార్ ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సూచనలు, అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొందరు ప్రయాణికులు ఎస్కలేటర్ వద్ద వృద్ధుల కోసం కేర్ టేకర్, రైలులో మగ, ఆడవాళ్లకి వేర్వేరుగా బాత్రూం ఏర్పాటు చేయాలని సూచించారు.

News October 8, 2025

జగన్ పర్యటనలో మార్పులు: గుడివాడ అమర్నాథ్

image

మాజీ సీఎం జగన్ విశాఖ పర్యటనలో మార్పులు జరిగాయని, ఆయన కేజీహెచ్‌లో కురుపాం విద్యార్థులను పరామర్శిస్తారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ప్రభుత్వ అధికారులు అనుమతులపై డ్రామా సృష్టిస్తూన్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి భయపడి ఫ్లెక్సీలు తొలగిస్తూ, ఆంక్షలతో పర్యటనను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.