News November 30, 2025

హనుమకొండ బీజేపీ ఇన్‌ఛార్జిగా బూర నర్సయ్య గౌడ్

image

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిలను నియమించారు. హనుమకొండ జిల్లా ఇన్‌ఛార్జిగా బూర నర్సయ్య గౌడ్ నియమితులయ్యారు. సంస్థాగత ఎన్నికలు, జిల్లాలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం జరిగింది. హనుమకొండ జిల్లాకు చెందిన పలువురు నేతలు నర్సయ్య గౌడ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 27, 2026

ఈ టైమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తే గుండె సేఫ్!

image

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజ్ చేసే టైమింగ్ ముఖ్యమని తాజా స్టడీలో తేలింది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య వర్కౌట్ చేసేవారికి గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తక్కువగా ఉంటుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వెల్లడించింది. దీనివల్ల ఒబెసిటీ 35%, గుండె జబ్బులు 31%, షుగర్ రిస్క్ 30% తగ్గుతాయని పరిశోధకులు గుర్తించారు. ఉదయం ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం, కొవ్వు త్వరగా కరగడం దీనికి కారణాలు.

News March 27, 2026

మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.

News March 27, 2026

కరీంనగర్‌లో సీతారామాంజనేయుల సైకత శిల్పం

image

కరీంనగర్‌లోని మార్కండేయ నగర్ బతుకమ్మ గ్రౌండ్‌లోని శ్రీ సీతారామాంజనేయ దేవాలయంలో సీతారాముల కల్యాణ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను అలరిస్తోంది. జాతీయ అవార్డు గ్రహీత రేవెల్లి శంకర్ ఈ అద్భుత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఆలయ కమిటీ సభ్యులు సహకారంతో కమిటీ అత్యంత శ్రద్ధతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శిల్పాన్ని తిలకిస్తున్నారు.