News November 30, 2025

భూపాలపల్లి బీజేపీ ఇన్‌ఛార్జిగా దశమంతరెడ్డి

image

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జిలను నియమించారు. భూపాలపల్లి జిల్లా ఇన్‌ఛార్జిగా దశమంతరెడ్డి, ములుగు జిల్లా ఇన్‌ఛార్జిగా కొరడాల నరేష్ నియమితులయ్యారు. సంస్థాగత ఎన్నికలు, జిల్లాలో పార్టీ కార్యక్రమాల దృష్ట్యా వీరిని నియమించారు. భూపాలపల్లి జిల్లా నేతలు దశమంతరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News March 15, 2026

సమస్యల పరిష్కారానికి ‘మీకోసం’ వెబ్‌సైట్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలు కేవలం ప్రత్యక్షంగానే కాకుండా ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించే PGRS, రెవెన్యూ క్లినిక్ సేవలను నగరవాసులు వినియోగించుకోవాలని కోరారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

News March 15, 2026

కడప: 16 నుంచి పశువులకు టీకాలు

image

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 15, 2026

GNT: అక్షరాంధ్ర పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

image

జిల్లాలో నిర్వహించిన ‘ఉల్లాస్ అక్షర ఆంధ్రా’ రాత పరీక్షలను కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి కేంద్రంలోనూ తాగునీటి సౌకర్యం ఉండాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 90,426 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.