News November 30, 2025
అన్నమయ్య జిల్లా స్కూళ్లకు రేపు సెలవు

తుఫాను నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఈవో కె.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. విద్యార్థులు కుంటలు, కాలువలు, చెరువులు, పాడుబడ్డ గోడల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కాలేజీలకు సెలవులపై ఎలాంటి ప్రకటన రాలేదు.
Similar News
News March 21, 2026
భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా మిస్సైల్ దాడి.. భారతీయుడు మృతి

సౌదీలో జరిగిన మిస్సైల్ దాడిలో ఓ భారతీయుడు మరణించాడు. యూపీకి చెందిన రవి గోపాల్ (26) రియాద్‌లోని ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మార్చి 18న భార్యతో ఫోన్లో మాట్లాడుతుండగా ఫ్యాక్టరీ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మిస్సైల్ శకలాలు మీద పడటంతో రవి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడని బంధువులు చెప్పారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపేందుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ప్రయత్నిస్తోంది.
News March 21, 2026
భద్రాచలం: పర్ణశాల ప్రత్యేకత తెలుసా.?

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పేరు ప్రపంచమంతా తెలిసిందే. అక్కడి నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సీతారామలక్ష్మణులు వనవాసం కాలంలో పర్ణశాలలో కుటీరం నిర్మించుకుని కొన్నేళ్లు నివాసం ఉన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరించింది కూడా ఇక్కడే అని చరిత్ర చెబుతోంది. భద్రాద్రికి వచ్చే భక్తులు పర్ణశాలను కూడా సందర్శించి, చరిత్ర తెలుసుకుంటుంటారు.
News March 21, 2026
మాజీ ఎమ్మెల్యే భౌతికకాయంపై టీడీపీ జెండాతో నివాళులు

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హనుమంతరావు చౌదరి భౌతికకాయంపై టీడీపీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఎమ్మెల్యేగా, నాయకుడిగా టీడీపీకి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.


