News November 30, 2025
మోదీ-షా దుష్ట రాజకీయాలు: కాంగ్రెస్

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీపై కొత్త FIR <<18428982>>నమోదు <<>>చేయడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కేంద్రం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది. ‘కాంగ్రెస్ నాయకత్వంపై వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార చర్యలతో కూడిన దుష్ట రాజకీయాలను మోదీ-షా ద్వయం కొనసాగిస్తోంది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారం బోగస్ కేసు. న్యాయమే గెలుస్తుంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
Similar News
News March 22, 2026
అల్లు అర్జున్-అట్లీ మూవీలో అనుష్క శర్మ?

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీ కాస్టింగ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఇప్పటికే దీపికా పదుకొణె, రష్మిక, మృణాల్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా అనుష్క శర్మ పేరు తెరపైకి వచ్చింది. ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె ఈ సినిమాతో పవర్‌ఫుల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. ఈ మూవీ టీజర్ ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.
News March 22, 2026
F-16 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చిందా?

ఇరాన్ ఎయిర్‌స్పేస్‌లో జరిగిన ఆపరేషన్‌లో తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్‌కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయని IRGC ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ ఈ వాదనను కొట్టిపారేసింది. తమ విమానంపై క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, కానీ పైలట్లు సేఫ్‌గా మిషన్‌ను పూర్తి చేసి తిరిగి వచ్చారని స్పష్టం చేసింది. విమానానికి ఎలాంటి డ్యామేజ్ కాలేదని పేర్కొంది.
News March 22, 2026
‘చచ్చాడు.. సంతోషం’: ట్రంప్ నోటి దురుసు!

అమెరికాలో FBI మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ (81) కన్నుమూశారు. 9/11 దాడుల తర్వాత FBI రూపురేఖలు మార్చిన ఆయన ట్రంప్-రష్యా సంబంధాలపై ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ కక్షను మనసులో పెట్టుకున్న ట్రంప్.. ముల్లర్ చనిపోగానే ‘చచ్చాడు.. చాలా సంతోషం. ఇక అమాయకులను వేధించలేడు’ అని అన్నారు. ఒక లెజెండరీ ఆఫీసర్ అంటూ చాలా మంది సంతాపం తెలుపుతుంటే ట్రంప్ ఇలాంటి కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.


