News November 30, 2025

రోహిత్ శర్మ సిక్సర్ల రికార్డు

image

దక్షిణాఫ్రికాతో మ్యాచులో రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచులో ఇప్పటికే మూడు సిక్సర్లు బాదిన ఆయన వన్డేల్లో అత్యధిక సిక్సర్లు(352-269Inns) బాదిన ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఆ తర్వాతి స్థానాల్లో పాక్ మాజీ ప్లేయర్ అఫ్రీది(351-369Inns), వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ గేల్(331-294Inns) ఉన్నారు.

Similar News

News March 27, 2026

అమరావతిలో మంటలు.. సెక్యూరిటీ గార్డే నిందితుడు?

image

AP: <<19480669>>అమరావతిలో<<>> పైపుల దహనం కేసులో మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌పై కోపంతో సెక్యూరిటీ గార్డు రాము నిప్పంటించినట్లు సమాచారం. రోజూ 12 గంటల డ్యూటీ, సెలవు ఇవ్వకపోవడంతో రాము కొన్నిరోజులుగా కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారని మంటలు పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

News March 27, 2026

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News March 27, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.