News November 30, 2025

ప.గో.జిల్లాలో 55 బస్సులకు నోటీసులు

image

పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. 45 బస్సులను పరిశీలించగా.. నిబంధనలు ఉల్లంఘించిన 55 బస్సులకు నోటీసులు జారీ చేయడంతో పాటు, మూడు బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక బస్సును సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారి కృష్ణారావు వెల్లడించారు.

Similar News

News March 20, 2026

గృహ గణనలో నిష్పాక్షికత: డీఆర్ఓ

image

భీమవరం కలెక్టరేట్‌లో గృహ గణనపై శుక్రవారం తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో డీఆర్ఓ శివన్నారాయణ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ.. గృహ గణన కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని తెలిపారు. గృహ గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News March 19, 2026

ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

image

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.

News March 19, 2026

భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

image

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.